తెలంగాణ
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరోసారి భారీ వర్షసూచన
రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా పెద్దగా వర్షాలు కురవలేదు.దీంతో ఈసారి సమ్మర్లో హీట్ వేవ్స్ ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది.అయితే, వర్షాకాలం ముగియడానికి వస్తున్న తరుణంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.గతవారం రోజులుగా రాష్ట్రంలో చెదురుమొదురు వర్షాలు కురుస్తున్నాయి. నేడు సైతం తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
