తెలంగాణ

గ్రేటర్ ప్రజలకు అలర్ట్.. ‘ఇందిరమ్మ టవర్స్’ దరఖాస్తులకు ముగుస్తున్న గడువు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ పథకం కింద ఇళ్లు పొందాలనుకునే అర్హులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల కలల ఇంటిని నిజం చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. రాజధానిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,680 ఎల్‌ఐజీ (LIG) ఫ్లాట్ల కేటాయింపు లక్ష్యంగా ప్రభుత్వం ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.