ఏపీ

భక్తులకు అలర్ట్.. తిరుమల ఘాట్ రోడ్డులో బైక్‌లకు నో ఎంట్రీ!

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టమైన 'గరుడ సేవ' సందర్భంగా రెండు ఘాట్ రోడ్లలోనూ ద్విచక్ర వాహనాల (బైక్‌ల) రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.