సినిమా

Ajith-Venkatesh: తెలుగు, తమిళ సీనియర్ హీరోల క్రేజీ మల్టీస్టారర్!

Ajith-Venkatesh: సౌతమిళ సీనియర్ హీరో అజిత్ కుమార్, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కలిసి ఓ సినిమాను చేయబోతున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఇటీవల, అజిత్ హీరోగా "డేర్ డెవిల్" అనే సినిమాను ప్రకటించారు. త్వరలో, ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో వెంకీ ఓ కీలక పాత్రను చేయనున్నాడట.