వ్యాపారం
AIWorkplace: 4 గంటలు పనిచేస్తే చాలు: '70 గంటల పని' చర్చపై రచయిత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ గంటలు పనిచేయడం కంటే పని నాణ్యత, ఏకాగ్రతలే అత్యంత ముఖ్యమని ప్రముఖ రచయిత చేతన్ భగత్ స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన 18వ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అంతరాయాలు, సమావేశాలు, విరామాలు లేకుండా పూర్తి ఏకాగ్రత, క్రమశిక్షణతో రోజుకు 4 గంటలు పనిచేస్తే ఉత్తమ ఉత్పాదకత సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆఫీసులో ఉద్యోగి ఎన్ని గంటలు గడిపారనే దానికంటే ఎంత నాణ్యమైన పని పూర్తి చేశారనేదే ప్రధానమని చేతన్ భగత్ పేర్కొన్నారు.
