వ్యాపారం

AI Startup success story : 100 మంది నో చెప్పారు.. కానీ నేడు రూ.38వేల కోట్ల సామ్రాజ్యం!

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సరికొత్త విప్లవాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక స్టార్టప్ ప్రస్థానం వ్యాపార రంగంలో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రారంభంలో ఐడియా బాగోలేదని వంద మందికి పైగా ఇన్వెస్టర్లు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినప్పటికీ, వ్యవస్థాపకుడి చెక్కుచెదరని నమ్మకంతో నేడు ఆ కంపెనీ ఏకంగా 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 38,000 కోట్లు) విలువైన దిగ్గజ సంస్థగా రూపాంతరం చెందింది. లండన్ కేంద్రంగా సేవలందిస్తున్న ఏఐ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫామ్ 'సింథీషియా' సాధించిన ఈ అసాధారణ విజయగాథ ప్రతీ నవతరం పారిశ్రామికవేత్తకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.