International
AI Scam Call: ఏఐ తో మోసం.. బ్యాంకు నుంచి రూ.1000 కోట్లు మాయం!!..
కేటుగాళ్లు ఏఐని ఉపయోగించి.. ఓ బ్యాంకుకు రూ.వేల కోట్లు కుచ్చుటోపి వేశారు.. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి సుమారు 1000 కోట్లు కొల్లగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భారీ మోసం ఇటలీలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ఇంటెసా శాన్‌పాలోలో చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇటలీలో అతిపెద్ద బ్యాంకు ఇంటెసా శాన్‌పాలో సంబంధిత విభాగమైన ఫిడ్యూరమ్ మాజీ ఛైర్మన్ పావొలో మోలెసినిని ఫిబ్రవరిలో కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఇంటెసా శాన్‌పాలో సీఈఓ కార్లో మెస్సీనాలా నమ్మబలికి ఏఐ వాయిస్ క్లోనింగ్ సృష్టించి ఫోన్ కాల్ చేశారు. దీంతో మాజీ ఛైర్మన్ పావొలో ఇదంతా నిజమనుకొని.. విదేశీ ఖాతాల్లోని నిధులను ట్రాన్స్‌ఫర్ చేయాలని తన ఫైనాన్స్ విభాగాన్ని ఆదేశించారు.
