వైరల్ న్యూస్

AI Impact: ఏఐ ఎఫెక్ట్.. 2లక్షల నుంచి 40వేలకు పడిపోయిన జీతం.. ఓ కాపీ రైటర్ మనోవేదన

నాణెనికి రెండు వైపులు ఉన్నట్లు.. ఏఐ రాకతో లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయి. ఈ సాంకేతిక విప్లవం ఉద్యోగ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఏఐ రాకతో లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమే అనేలా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ కాపీ రైటర్ పై ఏఐ తీవ్రమైన ప్రభావమే చూపింది. అతడి జీవితమే తలకిందులైపోయింది. ఏఐ రాకముందు అతడి నెల సంపాదన 2లక్షలుగా ఉండేది. ఏఐ వచ్చాక అతడి సంపాదన 40వేలకు పడిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కాపీ రైటర్ చెప్పుకుని తీవ్ర ఆవేదన చెందాడు.