International
AI Company Offer: హెల్మెట్ పెట్టుకుంటే చాలు.. గంటల వ్యవధిలోనే వేలల్లో జీతం!
తలకి ఒక ప్రత్యేకమైన హెల్మెట్ ధరించి కొన్ని గంటల పాటు కూర్చుంటే చాలు.. వేల రూపాయల నజరానా చెల్లిస్తోంది ఓ ప్రముఖ ఏఐ సంస్థ. మానవ ఆలోచనలను నేరుగా టెక్స్ట్‌గా మార్చే విప్లవాత్మక సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్న శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన 'కండ్యూట్' (Conduit) అనే ఏఐ స్టార్టప్ ఈ వినూత్న అవకాశాన్ని అందిస్తోంది. ఈ ప్రయోగాల్లో పాల్గొనే వలంటీర్లకు రెండు గంటల సెషన్‌కు ఏకంగా 55 డాలర్లు (దాదాపు రూ. 5,237) ఆఫర్ చేస్తోంది.
