దునియా

AI: 2030 నాటికి ఏఐ మనుషులను చంపేస్తుందా..?

AI: ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సరికొత్త మాయాజాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). పనులను సులభతరం చేసే సాధనంగా మొదలైన ఈ సాంకేతికత, ఇప్పుడు మానవాళి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే స్థాయికి దూసుకెళ్తోంది. అత్యంత అధునాతనమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) 2030 నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుందని, అది మానవ మనుగడను శాశ్వతంగా తుడిచిపెట్టే ప్రమాదం ఉందని స్వయంగా టెక్ దిగ్గజం గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు వేసిన అంచనా ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఏఐ కూడా తన సిస్టమ్స్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ప్రకటించిన వేళ, గూగుల్ డీప్‌మైండ్ హెచ్చరికలు మరోసారి వైరల్ అవుతున్నాయిఇప్పటి వరకు మనం చూస్తున్న ఏఐ కేవలం నిర్దిష్ట టాస్కులకు మాత్రమే పరిమితం. కానీ ఏజిఐ (AGI) అలా కాదు. మనుషుల కంటే వేగంగా విభిన్న రంగాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, దాన్ని స్వతంత్రంగా అమలు చేయడం దీని ప్రత్యేకత.