తెలంగాణ
ఆదివాసీ భూముల్లో అగ్రి మినిస్టర్ కుట్రలు!
ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న 30 ఎకరాల భూదాన్ భూముల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 25 (25-02-2026)న 600 ఇళ్లను కూల్చివేశారు. 2014లోనే పట్టాలు ఇచ్చి, హౌస్ నెంబర్స్‌తో పాటు సీసీ రోడ్లు ఉన్నాయి. అయినా కానీ నకిలీ పట్టాలిచ్చి లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో 10 ఎకరాల్లో నిర్మాణాలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. పామాయిల్ పంట ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఆదివాసీలకు చెందిన భూములను పెద్ద ఎత్తున లీజులకు తీసుకున్నారు. అందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బంధువులు భద్రాది కొత్తగూడెం ఏజెన్సీ గ్రామాల్లో 2 వేల ఎకరాలను చేతుల్లోకి తీసుకున్నారు.
