వైరల్ న్యూస్
అఘోరీ మంత్రం.. డబ్బుల కట్ట ఇచ్చేసిన వ్యాపారి.. చివర్లో ట్విస్ట్!
దేశంలో దొంగ బాబాలు, అఘోరీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రాల పేరిట అమాయకులను మోసం చేయడం వారికి అలవాటుగా మారింది. పూజలు చేస్తే లాభాలు బాగా వస్తాయని ఎదుటి వ్యక్తులను నమ్మించి మోసం చేయడంతో పాటు అందినకాడికి దోచుకుని డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గుర్తుతెలియని మోసగాడు అఘోరీ వేషంలో ఓ బంగారు షాపులోకి వచ్చాడు.హర్ హర్ మహదేవ్ అనుకుంటూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అక్కడే ఉన్న యజమానికి మాయమాటలు చెప్పాడు. మీ భవిష్యత్ చెప్తానంటూ జ్యువెలరీ షాప్ ఓనర్ను నమ్మించేందుకు అఘోరీ యత్నించాడు. పెట్టుబడుల్లో లాభాలు వచ్చేలా చేస్తానని, ఓ నోట్ల కట్ట అడిగి తీసుకున్నాడు. అక్కడి నుంచి మెల్లిగా ఉడాయించాడు.
