ఏపీ

దంపతులను అమ్మేసిన ఏజెంట్.. వైరల్!

మలేషియాలో ఉద్యోగాల పేరుతో విశాఖకు చెందిన దంపతులను ఓ ఏజెంట్ మోసంచేశాడు.మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రామచంద్ర టెస్టింగ్ సెంటర్ నిర్వాహకుడు.. విశాఖకు చెందిన దంపతుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.మలేషియా పంపించి.. అక్కడికి వెళ్లగానే ఏజెంట్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ చేస్తాడని నిర్వాహకుడు నమ్మించాడు. అయితే, మలేషియాకు వెళ్లిన తర్వాత రీసివ్ చేసుకున్న ఏజెంట్ తమను ఓ హోటల్‌కు రూ.1.50 లక్షలకు అమ్మేశాడని దంపతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.