తెలంగాణ
Asaduddin: అడ్వకేట్ హత్య కేసు.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన సీనియర్ అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్‌కు జైలు సూపరింటెండెంట్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు రౌడీషీటర్ ఏకంగా రూ.2కోట్లు లంచంగా చెల్లించి బెయిల్ పొందాడని, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అమాయకులపై దాడులు చేయడమే కాకుండా మరిన్ని హత్యలకు కుట్రలు పన్నుతున్నాడని ఒవైసీ బాహాటంగానే విమర్శించారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం సుదీర్ఘ కాలంగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నందుకే లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని ఒవైసీ స్పష్టం చేశారు.
