తెలంగాణ టూ బెంగాల్.. గోడదూకిన 111 మంది నేతలు! ADR రిపోర్ట్‌తో దద్దరిల్లుతున్న పాలిటిక్స్..
ADR Report: భారత రాజకీయాల్లో ఎన్నికలు ముగియడమే ఆలస్యం.. సిద్ధాంతాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రజలు ఒక గుర్తును చూసి ఓటేస్తే, గెలిచిన నేతలు మాత్రం ఏమాత్రం సంకోచం లేకుండా అధికార పార్టీల పంచన చేరుతున్నారు. ఇటీవల 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ రిలీజ్ చేసిన తాజా డేటా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. 2022 నుంచి 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 111 మంది ప్రజాప్రతినిధులు (26 మంది లోక్‌సభ ఎంపీలు, 7 గురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు) పార్టీ ఫిరాయించారనే వాస్తవం ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.దక్షిణాది వేదికగా తెలంగాణ రగడ..ఈ ఫిరాయింపుల పర్వంలో తెలంగాణ రాజకీయాలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల్లో 9 మంది కాంగ్రెస్ గూటికి చేరారని ADR నివేదిక అధికారికంగా తేల్చింది. అయితే ఇతర రాష్ట్రాల్లో లాగా ఇక్కడ వ్యవహారం అంత తేలిగ్గా క్లోజ్ కాలేదు.
