తెలంగాణ
సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..
రేషన్ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలించడం.. అక్కడ పాలిష్ చేయడం.. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు ఉన్నాయో, లేవో స్పష్టత లేని బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.కొందరు మిల్లర్లు, వ్యాపారులు పీడీఎస్ ద్వారా లభించే బియ్యాన్ని గ్రామస్థాయిలో ఏజెంట్ల ద్వారా సేకరించి.. మిల్లుల్లో పాలిష్ చేసి.. వివిధ బ్రాండ్ల పేర్లతో కొత్త సంచుల్లో నింపి.. సన్నబియ్యం, సూపర్ ఫైన్ క్వాలిటీ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ తరహా అక్రమ దందా విస్తరించిందనే విమర్శలు వస్తున్నాయి.
