తెలంగాణ

TG : నేడు ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్‌ను సుమారు రూ.54 కోట్లతో నుంచి రూ. 60 కోట్ల వ్యయంతో నిర్మించారు.ఆదిలాబాద్ పట్టణ శివారులోని జాతీయ రహదారి-44 సమీపంలో ఈ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.కేవలం హైదరాబాద్ మహానగరానికే పరిమితం కాకుండా టైర్-2 నగరాలకు ఐటీ సేవలను విస్తరించడంలో భాగంగా, స్థానిక చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ఐటీ హబ్ ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక జిల్లాల్లోనూ ఈ ఐటీ టవర్స్ నిర్మించి స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించారు. చిన్న చిన్న సంస్థలు స్థాపించే వారికి రాయితీలు సైతం కల్పించారు.