వ్యాపారం
Adani Airports: విమానయాన రంగంలోకి అదానీ? ఊహాగానాలపై స్పష్టత!
భారత విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ స్వయంగా ఎయిర్‌లైన్ సేవలతో అడుగుపెట్టబోతోందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై అదానీ ఎంటర్ప్రైజెస్ ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ తరహా ప్రచారాలు, కథనాలు ముమ్మాటికీ నిరాధారమైనవని, విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచన తమకు అసలు లేదని సంస్థ అధికారిక ప్రకటన ద్వారా ఖండించింది.
