సినిమా
చిన్న వయస్సులోనే స్టార్ డమ్ అందుకొని అండర్ వరల్డ్ దెబ్బకు పారిపోయిన హీరోయిన్!..
ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సోనమ్.. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచారు. భక్తవర్ ఖాన్ అసలు పేరుతో జన్మించిన సోనమ్.. తెలుగులో ‘సామ్రాట్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్‌లో ఉండగానే దర్శకుడు రాజీవ్ రాయ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. కుటుంబ, వ్యక్తిగత కారణాలతో విదేశాల్లో గడిపిన ఆమె.. 2023లో ముంబైలో మళ్లీ కనిపించారు. ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు, ఓటీటీ అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమని చెప్పినట్లు కథనాలు వచ్చాయి.
