National
ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు గల్లంతు!
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగించినట్టు సమాచారం.ఆయనకు నాలుగు ఓట్లు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో బెంగళూరులో తన ఓటును ఎన్నికల సంఘం అధికారులు తొలగించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. తన ఓటును ఎన్నికల సంఘం తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్ఐఆర్లో భాగంగా బెంగళూరు సెగ్మెంటులోదాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, అందులో తన పేరు కూడా ఉందంటూ ట్వీట్ చేశారు.తాను బెంగళూరులో పుట్టి, అక్కడే పెరిగి, విద్యాభ్యాసంతో పాటు థియేటర్ ప్రయాణం కూడా సాగించానని పేర్కొన్నారు.
