సినిమా

Actor Ali: నాకు అన్నం పెట్టింది సినిమా! వాళ్ళు నన్ను కరివేపాకులా తీసేశారు!

Actor Ali : నా సినిమాలు మానుకుని మరీ వెళ్లి ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి ఎంత ప్రచారం చేశానో ప్రజలందరికీ తెలుసు. కానీ, నాకు అక్కడ ఏ గుర్తింపు దక్కలేదు. ఇలా, ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుందా లేదా? నాకు అన్నం పెట్టింది సినిమానే.. రాజకీయం, ఏ రాజకీయ నాయకుడు కాదు. సినిమాలతో పాటు, బయట కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. ఇంత పేరున్న నన్ను వైసీపీ వాడుకుని, గుర్తింపు లేకుండా కరివేపాకులా తీసి పారేసింది.