తెలంగాణ
సీఎం హెచ్చరికతో కదలిక.. యాదాద్రి ప్లాంట్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు!
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు, సరఫరా సమస్యలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన, పరిస్థితిలో తక్షణ మార్పు రాకపోతే ఉన్నతాధికారులను సైతం సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని గట్టి హెచ్చరిక జారీ చేశారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు అవసరమైన లింకేజీలు ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో మందగమనం ఎందుకు ఉందో నిలదీస్తూ తక్షణ నివేదిక కోరారు.
