తెలంగాణ
సింగరేణి నైపుణ్య శిక్షణ కేంద్రం ఘనత.. 87 మంది మహిళలకు ఉద్యోగాలు!
సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రామగుండం-1 (ఆర్జీ-1) ఏరియాలోని సింగరేణి జీవీటీసీ (GVTC) నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలలో స్థానిక యువత అద్భుతమైన విజయం సాధించింది. తాజాగా నిర్వహించిన నియామకాల్లో మొత్తం 112 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా, అందులో హైదరాబాద్లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ 'ఫాక్స్కాన్' (Foxconn) కంపెనీలో ఏకంగా 87 మంది మహిళలకు ఉద్యోగాలు దక్కడం విశేషం.
