క్రైమ్
హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం.. యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు!..
హైదరాబాద్–శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి కిందపడిన శివయాదవ్‌ను.. వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో శివయాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాండ్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
