తెలంగాణ

తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..

తెలంగాణ సచివాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సచివాలయ ప్రాంగణంలోని టెంపుల్ దగ్గర లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన రెండు లక్షల రూపాయల చెక్కు కోసం ఏకంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సెక్షన్ ఆఫీసర్ వినోద్ పేరు కూడా వెలుగులోకి రావడంతో ఆయనను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. మరో అధికారి పాత్రపైనా అనుమానాలు ఉండటంతో సచివాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.