తెలంగాణ

భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!

రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని పలు విభాగాల్లో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన వారి మీద, వారి బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ వరుస దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రభుత్వ అధికారిపై ఏసీ కొరడా ఝలిపించినట్టు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్టు సమాచారం. గురువారం తెల్లవారు జామున ఆయన ఇళ్లు,బంధువులు, బినామీల ఇండ్లపై దాడులు జరిపినట్టు తెలుస్తోంది.ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.