తెలంగాణ

ఇబ్రహీంపట్నంలో ఏసీబీ కలకలం.. ఏవో శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో సోదాలు!..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై  అవినీతి ఆరోపణలతో ఆయనను ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.