క్రైమ్

నిమ్స్‌లో తొలిసారి ఏసీబీ ఆకస్మిక సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్ ఇంట్లో తనిఖీలు!

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు తొలిసారి సోదాలు చేపట్టారు. ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు చేపట్టాయి.  నిమ్స్ ఆసుపత్రి చరిత్రలోనే ఓ ఉన్నతాధికారిపై ఈ స్థాయిలో ఏసీబీ సోదాలు జరగడం ఇదే మొదటిసారి కావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ సోదాలు ఏకకాలంలో మూడు జిల్లాల పరిధిలోని 12విభిన్న ప్రాంతాల్లో కొనసాగాయి.