తెలంగాణ

రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్

మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా 2.50 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. 22Aలో ఉన్న భూమి సక్సెషన్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేశారు అధికారులు.