తెలంగాణ
ACB : లక్ష్మీభాస్కర్‌కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లు, కార్యాలయం, బంధువులు, బినామీల ఇండ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఆయనకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం లక్ష్మీ భాస్కర్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఏసీబీ సమర్పించిన ఆధారాలు పరిశీలించిన నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం భద్రతా సిబ్బంది ఆయనను నగరంలోని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. నిమ్స్ ఉన్నతాధికారి హోదాను అడ్డం పెట్టుకుని భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది.
