TG : కాళేశ్వరంలో జలకళ.. రాష్ట్రంలో కరువు నేల!
కాళేశ్వరం కన్నెపల్లి వద్ద గోదావరి జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. 22 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్టు తెలిసింది. అక్కడ రోజుకు దాదాపు 1.9 టీఎంసీల నీరు ప్రవాహిస్తుండగా.. రేవంత్ సర్కార్ మాత్రం సాగుకు నీళ్లు లేవంటూ చెబుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుబాటులో ఉన్న జలాలను సాగు కోసం ఎందుకు వినియోగించడం లేదని రైతులు, ప్రతిపక్ష నేతలు నిలస్తున్నారు. రేవంత్ సర్కారుకు అన్నదాతల మీద అంత ప్రేమ ఉంటే.. అధికారంలోకి వచ్చి మూడేండ్లు అయినా ఎందుకు మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయలేదని.. విచారణల పేరుతో కాలయాపన చేసి తీరా కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో రిపేర్లు చేయిస్తామని హడావుడి చేస్తే దిగువకు వెళ్లిపోయిన నీటిని ఎలా తెస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇ ళేశ్వరంలోని కన్నెపల్లి వద్ద ఇప్పుడు కూడా నీరు వృథాగా పోతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.రేవంత్ సర్కార్కు నీటిని ఎత్తిపోయడం చేతగాకపోతే తమకు అప్పగిస్తే నీళ్ళు ఎత్తిపోసి చూపిస్తామని మరోసారి ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
