Abhijit Deepke: అలా చేస్తే నన్ను ఉరితీయండి : అభిజీత్ దీప్కే
Abhijit Deepke: "నేను అల్లర్లు చేసేలా మాట్లాడినట్లు ఒక్క వీడియో కానీ, ఒక్క ఆధారం కానీ చూపించండి.. నన్ను ఉరితీసినా పర్లేదు" అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ పోలీసులకు గట్టి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుకు వ్యతిరేకంగా, తమ పార్టీ నేతల అరెస్టులను ఖండిస్తూ సీజేపీ చేపట్టిన 'తిరంగా యాత్ర' ఇప్పుడు ఢిల్లీలో తీవ్ర రచ్చకు దారితీసింది. ఈ యాత్రను ఆపాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం మరింత వేడెక్కింది.అల్లర్లు సృష్టిస్తున్నారంటూ సుమారు 15 నుంచి 20 మంది పోలీసులు ఢిల్లీలోని అభిజిత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు చేతిలో పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా భగ్గుమన్నారు. "సోషల్ మీడియాలో నేను ఎక్కడైనా అల్లర్లు రేపేలా మాట్లాడినట్లు ఒక్క ఆధారం ఉందా? తెల్ల కాగితం మీద మీకు తోచింది రాసుకొచ్చి నా చేతిలో పెడితే సరిపోతుందా? తప్పు చేసినట్లు నిజంగా ప్రూఫ్ ఉంటే నన్ను డైరెక్ట్‌గా ఉరితీయండి" అంటూ పోలీసుల ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు.
