National
Abhijeet Deepke: తమ చావును తామే కొనితెచ్చుకుంటున్నారు.. ఢిల్లీ జనంపై అభిజీత్ దీప్కే ఫైర్!
Abhijeet Deepke: దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలు తీవ్ర విషవాయువుల కోరల్లో చిక్కుకున్నాయి. రూల్స్ బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా విచ్చలవిడిగా బాణసంచా పేల్చడంతో రెండు మహానగరాలు గ్యాస్ ఛాంబర్లుగా మారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో నగరవాసులు శ్వాస తీసుకోలేక, కళ్లు మండి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దారుణ పరిస్థితులపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజల విచక్షణారహిత ప్రవర్తనను ఎండగడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
