వైరల్ న్యూస్

డబ్బు కట్టలతో షో .. అతి చేసి అనుభవించిన యూట్యూబర్ ఫ్యామిలీ!

కొందరు వ్యక్తులు సోషల్ మీడియానే తమ ప్రపంచంగా భావించి ఇంట్లోని సంసారాన్ని బజార్లో పెడుతున్నారు. వ్యూస్,లైక్స్ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. తమ ఇంట్లో ఉదయాన్నే ఏం చేస్తుంటాం, మధ్యాహ్నం ఏం చేస్తుంటాం. సాయంకాలం,రాత్రి ఇలా ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం కొందరికి వ్యసనంలా మారింది. ఫలితంగా మన వ్యక్తిగత డిటేల్స్, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? వస్తువులు ఏం ఉన్నాయ్.. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ క్రిమినల్స్, దొంగలు, సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుందని గుర్తించడం లేదు. తీరా గుర్తించే సరికి ఆలస్యం అవుతోంది. ఓ యూట్యూబర్ ఫ్యామిలీ తాజాగా తన ఇంట్లో ఎంత డబ్బు ఉందో సోషల్ మీడియా రీల్స్ ద్వారా బహిర్గతం చేసింది. డబ్బు మొత్తం బీరువాలో నుంచి తీసి చూపిస్తూ ఇంట్లో కుమ్మరించింది. తన కూతురి మీద నోట్ల వర్షం కురిపిస్తూ డ్యాన్సులు చేసింది. ఇంకేముంది ఆ వీడియో ఎవరి కంట పడకూడదో వారికంట పడింది. డబ్బును మాయం చేసేందుకు దొంగలు ముహూర్తం పెట్టారు.భార్యాభర్తలు ఇంట్లో లేనిసమయంలో వచ్చి మొత్తం దోచుకుని వెళ్లారు.