భర్త మిస్సింగ్ కేసులో ట్విస్ట్..ఇంట్లో దొంగ నోట్ల ప్రింటింగ్!
కనిపించకుండా పోయిన వ్యక్తి ఇంట్లో భారీ ఎత్తున దొంగ నోట్లను ముద్రించే సెటప్‌ను పోలీసులు కనిపెట్టారు. ఈ ఘటన కేరళంలో చోటుచేసుకుంది.కొల్లాం సిటీ పరిధిలోని వాడి, కల్లెలివయల్కు చెందిన సిబియాన్ అనే వ్యక్తి ఈనెల 16న అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య టిన్సీ పల్లితోట్టం పీఎస్‌లో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కొల్లాం సిటీ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ బృందం శనివారం సిబియాన్ ఇంట్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ. 2.5 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని ముద్రించేందుకు ఉపయోగించిన అత్యాధునిక ప్రింటింగ్ యంత్రాలు, ప్రత్యేక కాగితాలు, రసాయనాలు, సంబంధిత సామగ్రిని చూసి పోలీసులు, నార్కోటిక్ బృందాలు కంగు తిన్నాయి. దీంతో విచారణ స్పీడప్ చేసిన పోలీసులు వెంటనే సిబియాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
