బ్రెజిల్ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ.. నాలుగోసారి అధ్యక్షుడిగా లూలా..!
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మరోసారి ఘన విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన రన్ ఆఫ్ ఫైట్‌లో రైట్‌వింగ్ ప్రత్యర్థి ఫ్లావియో బోల్సనారోను ఓడించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో వెనుకబడిన లూలా డి సిల్వా.. ఎన్నికల ప్రచారంలో కార్మిక వర్గం, జీవన వ్యయం, ప్రజారోగ్య, ఆర్థిక సమస్యలపై దృష్టి సారించారు. దాంతో ప్రజలు మరోసారి లూలాకు పట్టం కట్టారు. బ్రెజిల్ దేశ అధ్యక్ష ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో ప్రజారవాణా నిలిచిపోవడం, భారీ వర్షాల కారణంగా ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలింగ్ సమయాన్ని మరో 2 గంటలు పొడిగించాల్సి వచ్చింది. ఉత్కంఠ భరింత సాగిన ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో లూలా 51.79 శాతం ఓట్లు సాధించగా, ఫ్లావియో బోల్సనారో 48.21 శాతం ఓట్లు పొందారు. 88 ఏళ్ల వయసులో లూలా నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
