National
ఉగ్రదేశం నన్ను ప్రశ్నిస్తోంది.. పాక్ జర్నలిస్టుకు జై శంకర్ దిమ్మతిరిగే కౌంటర్
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు కాస్త తగ్గినా దౌత్యపరంగా మాత్రం ఆ వైరం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వేదికల మీద ఇండియా పరువు తీయాలని ప్రయత్నించిన ప్రతిసారి దాయాది పాక్కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాక్ పన్నాగాలు వరుసగా విఫలం అవుతున్న తరుణంలో అంతర్జాతీయ వేదికల మీద భారత్ పరువు తీయాలని ప్రయత్నించే వారి కుట్రలను విదేశాంగశాఖ తిప్పికొడుతోంది. తాజాగా యూఎన్జీవో 81వ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్లో జరిగిన మీడియా మీట్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ పాక్ జర్నలిస్ట్ ‘పాకిస్తాన్లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మీ దేశం ఎప్పుడు ఆపుతుంది’ అని ప్రశ్నించగా.. ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఒక ఉగ్రవాద దేశమే నన్ను ఈ ప్రశ్న అడుగుతోంది. కమాన్’ అని ఘాటు జవాబు ఇచ్చారు.
