తెలంగాణ
తెలంగాణలో సాంకేతిక విప్లవం.. దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట!
తెలంగాణ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, పౌర సేవలందించడంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు విస్తృత సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) ఈ అధునాతన సేవలను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
