వరంగల్ ప్రజలకు షాక్.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం వాయిదా!
వరంగల్ ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇవాళ ప్రారంభం కావాల్సిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరా కానుకగా ఆస్పత్రిని 'సాఫ్ట్ లాంచ్' చేసి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాలతో హాస్పిటల్ ప్రారంభం వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.ఈ విషయం తెలియడంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆసుపత్రి భవన నిర్మాణం, మౌలిక వసతులు, వైద్య పరికరాలు సమకూర్చడంలో ఆలస్యం కావడంతో ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.అయితే, సరైన సన్నద్ధత లేకుండా కేవలం ప్రచారం కోసమే మంత్రులు గడువులు ప్రకటిస్తున్నారని, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్థానిక ప్రజాసంఘాలు మండి పడుతున్నాయి.
