చికెన్ ప్రియులకు షాక్.. మళ్లీ కొండెక్కిన ధరలు
నాన్ వెజ్ ప్రియులకు మరో షాక్ తగిలింది.చికెన్ ధరలు కొండెక్కాయి. ఆదివారం కావడంతో ఈరోజు మాంసానికి భారీగా డిమాండ్ ఉంటుంది. మిగతా వారాల్లో కొందరు మాంసానికి దూరంగా ఉంటారు. సండే హాలిడే కావడం, కుటుంబసభ్యులు అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. ఎక్కువగా నాన్వెజ్ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. భారీ డిమాండ్ నేపథ్యంలోనే వ్యాపారులు సైతం క్యాష్ చేసుకునేందుకు ధరలు పెంచడానికి మొగ్గుచూపుతారు.ఈ క్రమంలోనే చికెన్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు పెరిగినట్టు సమాచారం.గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధర కిలోపై రూ.20 నుంచి రూ.30వరకు పెరిగినట్టు సమాచారం.పౌల్ట్రీ ఉత్పత్తి, డిమాండుకు సరిపడా సరఫరా వ్యత్యాసాల కారణంగా వ్యాపారులు ధరలను పెంచినట్లు తెలుస్తోంది. మటన్ ధర సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు చికెన్, చేపలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
