International

అమెరికా సంచలన ఆఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166కోట్ల రివార్డు!

ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమంపై అత్యంత కీలకమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించిన వారికి ఏకంగా 20మిలియన్ డాలర్ల (దాదాపు రూ.166కోట్లు) వరకు భారీ బహుమతిని అందజేస్తామని అమెరికా సైనిక విభాగం యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' (Rewards for Justice) ప్రత్యేక కార్యక్రమం కింద ఈ సంచలన ఆఫర్‌ను సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా విడుదల చేసింది. సమాచారం అందించిన వ్యక్తులకు ఉదారంగా నజరానాతో పాటు అవసరమైతే వేరే సురక్షిత ప్రాంతాలకు పునరావాసం కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది.