National
రూ.500 టికెట్‌తో మారిన తలరాత.. రూ.30కోట్ల జాక్‌పాట్!
కేరళ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రసిద్ధ 'తిరువోణం బంపర్ లాటరీ' (BR-111) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాదికి సంబంధించి ఏకంగా రూ.30 కోట్ల భారీ ప్రథమ బహుమతిని ఓ అదృష్టశాలి గెలుచుకున్నారు. శనివారం మధ్యాహ్నం తిరువనంతపురంలోని గోర్కీ భవన్లో అధికారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ లాటరీ డ్రా ప్రక్రియను పూర్తి చేశారు. రూ.500 విలువ చేసే టికెట్‌తో ఒక సామాన్యుడిని ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేసిన ఈ విజయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ డ్రాలో 'TL 360615' నంబర్ గల లాటరీ టిక్కెట్‌కు మొదటి బహుమతి రూ.30కోట్లు వరించింది. కన్నూర్ జిల్లా చక్కరక్కల్ ప్రాంతంలో ఉన్న ముత్తు లాటరీ ఏజెన్సీ ప్రతినిధి ఈ విజేత టిక్కెట్‌ను విక్రయించినట్లు లాటరీ శాఖ అధికారులు వెల్లడించారు.
