క్రైమ్

ప్రాణం తీసిన రూ.20 వాటర్ బాటిల్..!

రూ.20 వాటర్ బాటిల్ కోసం ఓ వ్యక్తిపై దాడి చేసి మరి హత్య చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణానికి ముందు బాధిత వ్యక్తి తనకు పిల్లలు ఉన్నారని, కొట్టొద్దని ఎంత వేడుకున్నా దుండగులు విడిచిపెట్టలేదు. దెబ్బలకు తాళలేక సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకివెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33) పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వారం క్రితం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి సాయికుమార్ వెళ్లాడు.ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పడమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్‌షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు సాయికుమార్ యత్నించాడు. అయితే, దొంగతనం చేస్తున్నాడని భావించిన నలుగురు దాడి చేయడం దెబ్బలకు తాళలేక మరణించాడు.