ప్రపంచం

డిజిటల్ మీడియాకు కొత్త లుక్.. వెబ్‌సైట్ డిజైన్లలో నయా ట్రెండ్!

డిజిటల్ మీడియా రంగం రోజురోజుకూ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. వెబ్‌సైట్లు ఇప్పుడు పాఠకుడి అనుభవానికి పెద్దపీట వేస్తున్నాయి. అందుకు అనుగుణంగా డిజైన్లలోనూ భారీ మార్పులు కనిపిస్తున్నాయి. మొబైల్‌ ఫోన్ల వినియోగం పెరగడంతో మొబైల్‌ ఫ్రెండ్లీ డిజైన్లకు ప్రాధాన్యం పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందించేలా క్లీన్‌ లేఅవుట్, స్పష్టమైన ఫాంట్లు, ఆకర్షణీయమైన విజువల్స్‌, షార్ట్‌ వీడియోలు, ఫోటో గ్యాలరీలకు వెబ్‌సైట్లు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాగే పాఠకుడు వెబ్‌సైట్‌లోకి వచ్చిన వెంటనే తనకు కావాల్సిన సమాచారాన్ని సులభంగా గుర్తించేలా నావిగేషన్‌ వ్యవస్థను కూడా మారుస్తున్నారు. ట్రెండింగ్‌ న్యూస్‌, బ్రేకింగ్‌ న్యూస్‌, లోకల్‌ న్యూస్‌, వీడియోలు, స్పెషల్‌ స్టోరీలను ప్రత్యేకంగా చూపించే విధంగా హోమ్‌పేజీలను డిజైన్‌ చేస్తున్నారు.