క్రైమ్

కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..

ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను తీసుకుని బావిలో దూకింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిబిడ్డలు ఇద్దరు మరణించారనే విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత(26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కూతురు అక్షిత(6), కుమారుడు మహేందర్(18 నెలలు)ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొన్నాళ్లుగా రజిత తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది.పుట్టింటికి వచ్చినా భర్త వేధింపులు ఆగకపోడంతో తన కూతురిని నడముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.