తెలంగాణ
తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. సన్న బియ్యం ధరలకు చెక్!
రాష్ట్రంలో నాణ్యమైన సన్న బియ్యం ధరల విచ్చలవిడి పెరుగుదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి అడ్డుకట్ట వేసింది. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, అక్రమ నిల్వల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతూ ధరలు పెంచుతున్నారనే ఫిర్యాదులపై పౌరసరఫరాల శాఖ తీవ్రంగా స్పందించింది. వినియోగదారులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు గాను వివిధ రకాల సన్న బియ్యం గరిష్ఠ చిల్లర ధరలను (MRP) ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిల్లర్లు, ప్రధాన వ్యాపారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పరిమితిని అధికారికంగా నిర్ణయించారు.
