తెలంగాణ

లవ్ మ్యారేజ్, మంచి ప్యాకేజీలు, కవలపిల్లలు..అయినా ఘోరం!

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడింది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఏపీకి చెందిన యువతి హైదరాబాద్ పరిధిలో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలీదు కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్దలు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. విశాఖపట్నంకు చెందిన రమాకాంత్, శ్రీకాకుళంకు చెందిన మౌనిక సంతోషి (28) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ – ఘట్‌కేసర్ ప్రాంతం పోచారం డివిజన్‌లోని గెలాక్సీ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుండగా రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరిమధ్య మనస్పర్దలు రావడంతో మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది.