రేణుకాస్వామి హత్యలో కీలక మలుపు.. మరోసారి చిక్కుల్లో హీరో దర్శన్
కన్నడ హీరో దర్శన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న ఆయనకు కఠిన శిక్ష తప్పేలా లేదని తెలుస్తోంది. ఎందుకంటే రేణుకాస్వామి హత్యకేసులో ఏ-14గా ఉన్న నిందితుడు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది.దీంతో విచారణలో భాగంగా పోలీసులకు అసలు నిజాలను వెల్లడించినట్టు సమాచారం. రేణుకాస్వామి హత్య కేసులో A-14గా దర్శన్ అనుచరుడు ప్రదోష్ ఉన్నాడు. విచారణలో ఆయన వెల్లడించిన నిజాలు ఇలా ఉన్నాయి. ‘పవిత్ర గౌడకు మెసేజ్‌లు పంపిన రేణుకాస్వామిని దర్శన్ బూతులతో దూషిస్తూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు.బట్టలూడదీసి దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత దర్శన్ కాల్ చేయగా.. ఘటనా స్థలానికి వెళ్లి రేణుకాస్వామిని పవిత్ర గౌడ చెప్పుతో కొట్టింది. అనంతరం రేణుకాస్వామిని అండర్వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
