క్రైమ్
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్లో భారీగా ఆర్మీ ఆయుధాలు చోరికి గురైన విషయం తెలిసిందే.ఘటన జరిగి రెండు వారాలు దాటింది. ఈ కేసులో ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు, రాష్ట్ర పోలీసులు ఉమ్మడిగా విచారణ జరుపుతున్నారు.దీంతో ఈ కేసు కీలక ములుపు తిరిగింది. ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు నలుగురు గార్డులను సైతం ఉన్నతాధికారులు విచారించారు. వారు అందించిన సమాచారం మేరకు తాజాగా ముగ్గురు సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్టు తెలిసింది. ఆర్మీ రెజిమెంట్ శిక్షణా కేంద్రంలో వినియోగించే ఆయుధాలు, బుల్లెట్లకు ఎలాంటి ప్రత్యేక కోడింగ్ నంబర్లు ఉండవని సమాచారం.
