తెలంగాణ

మాజీ మంత్రి ‘కొండా’కు కీలక పదవి? బ్యాలెన్స్ చేస్తారా?

మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆమె దూరంగా ఉన్నారు. దీంతో కొండా సురేఖ ఏం చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? పార్టీలో ఉంటారా? వేరే పార్టీలోకి వెళ్తారా? అనే చర్చ మరోసారి మొదలైంది. మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించాకా? ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలకు తెరలేపుతారని అంతా భావించారు. కానీ, ఆమె మాత్రం పదవికి రాజీనామా చేయబోనని..కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఇదిలాఉండగా, కొండా సురేఖ పార్టీ మీద, సీఎం రేవంత్, కీలక నేతల మీద అలకబూనినట్టు అధిష్టానం గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొండా సురేఖకు కీలక పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచన చేసినట్టు తెలుస్తోంది. TPCC అధ్యక్షురాలిగా ఆమెకు అధిష్టానం బాధ్యతలు అప్పగించనుందని సమాచారం. ఈ విషయంపై చర్చలు జరిపేందుకే.. హస్తినకు రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.